News8th Sep 03:57 PMSunil Byrisetty1 min read
ఉల్లి మార్కెట్‌లో రైతుల సమస్యలపై షర్మిల ఆవేదన
కర్నూల్ ఉల్లి మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఉల్లి క్వింటాకు వెంటనే ₹2,500 మద్దతు ధర ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులు ఎక
కర్నూల్ ఉల్లి మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఉల్లి క్వింటాకు వెంటనే ₹2,500 మద్దతు ధర ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులు ఎకరాకు ₹80 వేల నుంచి ₹1.20 లక్షల వరకు ఖర్చు పెట్టినా, మార్కెట్‌లో క్వింటాకు ₹600 కూడా అందకపోవడం దారుణమని పేర్కొన్నారు. గత ఏడాది ఇదే మార్కెట్‌లో క్వింటాకు ₹4,500 ధర లభించిందని, ఇప్పుడు ₹300 ఇస్తారా అని అడగడం రైతులను అవమానించడం అని విమర్శించారు. మద్దతు ధర లేక ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, వారికి కేసులు పెట్టడం అన్యాయం అని అన్నారు. రైతుల పంటను రాజకీయ రంగంలోకి తేవడం సరైంది కాదని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.