Politics18th Sep 04:09 PMSunil Byrisetty1 min read
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ముహూర్తం ఫిక్స్!
'వైఎస్ అంజలి రెడ్డి-సోమల రఘురామ్ రెడ్డి' వివాహ వేడుకల తేదీలను X వేదికగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రకటించారు. ఈ నెల 24న నిశ్చితార్థం.. నవంబర్ 25న వివాహం.. డిసెం
'వైఎస్ అంజలి రెడ్డి-సోమల రఘురామ్ రెడ్డి' వివాహ వేడుకల తేదీలను X వేదికగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రకటించారు. ఈ నెల 24న నిశ్చితార్థం.. నవంబర్ 25న వివాహం.. డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇడుపులపాయలోని YSR ఘాట్ వద్ద తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు షర్మిలా రెడ్డి ప్రకటించారు. తన కుమార్తె వివాహం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన సందర్భమని పేర్కొన్నారు. అంజలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని షర్మిల ఆకాంక్షించారు. 'నాన్న వైఎస్సార్ దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ' అని వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యానించారు.