Politics7th Oct 10:33 AMSunil Byrisetty1 min read
న్యాయం కోసం సునీత పోరాటం.. సీబీఐ కోర్టులో పిటిషన్ !
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె మళ్లీ సీబీఐ కోర్టుకెక్కారు. ఆ కేసులో న్యాయం జరిగే వరకూ పోరాడాలని వైఎస్ సునీత నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె మళ్లీ సీబీఐ కోర్టుకెక్కారు. ఆ కేసులో న్యాయం జరిగే వరకూ పోరాడాలని వైఎస్ సునీత నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసు విచారణను కొనసాగించాలని.. సూత్రధారుల గురించి ఇంకా బయటకు రావాల్సి ఉందని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె పిటిషన్ ను సీబీఐ కోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. నిందితులకు పిటిషన్ కాపీలు అందేలా చూడాలని సూచించారు. సుప్రీంకోర్టు సూచనలతో వైఎస్ సునీత హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోసారి విచారణ చేయించాలని సునీత కోరుతున్నారు.