Politics18th Sep 11:12 AMSunil Byrisetty1 min read
సీఎంతో వైఎస్ సునీత సీక్రెట్ భేటీ?
మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకా కుమార్తె సునీత, తన భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబును రహస్యంగా కలిసినట్లు సమాచారం. రాజశేఖర్‌రెడ్డి సోదరుడైన శివప్రకాష్ రెడ్డి
మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకా కుమార్తె సునీత, తన భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబును రహస్యంగా కలిసినట్లు సమాచారం. రాజశేఖర్‌రెడ్డి సోదరుడైన శివప్రకాష్ రెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం కడప జిల్లా టీడీపీలో కలకలం రేపుతోంది. సునీత దంపతులు సీఎం చంద్రబాబును కలిస్తే వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచాలని కోరడానికి అని వార్తలు వచ్చేవి. అయితే ఈసారి మాత్రం జెడ్పీ ఛైర్మన్ పదవి కోసమని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పదవి కోసం ఇప్పటికే కూటమిలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఒకవైపు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులరెడ్డి వర్గం.. మరోవైపు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గాలు పోటీ పడుతున్నాయి.