Politics19th Dec 04:37 PMSunil Byrisetty1 min read
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడితో విష్ణు భేటీ
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ సిన్హాని కలిసినట్లు ఆ పార్టీ నేత యస్. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కేవలం 45 ఏళ్ల వయసులోనే పార్టీలో అగ్రస్
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ సిన్హాని కలిసినట్లు ఆ పార్టీ నేత యస్. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కేవలం 45 ఏళ్ల వయసులోనే పార్టీలో అగ్రస్థానానికి ఎదిగి, పార్టీ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన నితిన్ నబీన్ నియామకం, వారి నాయకత్వ లక్షణాలు దేశంలో యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తోందన్నారు. ఇలా అర్హులైన నేతలను గుర్తించడం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమని అన్నారు . అర్హత, విలువలు, నాయకత్వ లక్షణాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ వ్యవస్థకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనతా యువ మోర్చాలో నితిన్ నబీన్ తో కలిసి పనిచేసిన అనుభవాలను ఇరువురూ స్మరించుకుని పంచుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. బీజేపీ ప్రతి స్థాయిలో ప్రతిభ ఆధారంగా కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుతూ, గతంలో కూడా అనేక మందిని దేశానికి అందించిన ఘనత బీజేపి జాతీయ నాయకత్వానికి ఉందని కొనియాడారు.