Politics22nd Sep 11:56 AMSunil Byrisetty1 min read
టీడీపీ నుంచి వైయస్ ఫ్యామిలీ పోటీ?
దివంగత వైఎస్ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి టీడీపీలో పోటీకి సిద్ధమవుతున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును డాక్టర్
దివంగత వైఎస్ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి టీడీపీలో పోటీకి సిద్ధమవుతున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును డాక్టర్ నర్రెడ్డి సునీత దంపతులు కలవడంతో ఇదే ప్రచారం జరుగుతోంది. తన బావ నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి కుమారుడికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబును సునీత దంపతులు కోరినట్టు ప్రచారం జరిగింది. అయితే ఇంకో ప్రచారం వైఎస్సార్ కడప జిల్లాలో విస్తృతంగా సాగుతోంది. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల జెడ్పీటీసీగా పోటీ చేయాలని డాక్టర్ సునీతను మంత్రి లోకేశ్ కోరినట్టు సమాచారం. జెడ్పీటీసీగా గెలిపించి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తామని సునీతకు లోకేశ్ ఆఫర్ చేసినట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్‌పై సునీత ఇంకా స్పందించలేదని సమాచారం. ఆలోచించుకుని చెప్తామని లోకేశ్‌తో అన్నట్టు తెలిసింది. నర్రెడ్డి రాజశేఖర్‌ది లింగాల మండలమే. అందుకే అక్కడి నుంచి పోటీ చేయాలని లోకేశ్ ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు.