Education7th Jun 12:38 PMSunil Byrisetty1 min read
క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న డా. వైఎస్ఆర్ క్రీడా పాఠశాల, కడపలో 2025-26 విద్యా సంవత్సరానికి నాలుగు, ఐదో తరగతి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న డా. వైఎస్ఆర్ క్రీడా పాఠశాల, కడపలో 2025-26 విద్యా సంవత్సరానికి నాలుగు, ఐదో తరగతి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు మే 31 నుంచి జూన్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం (తరగతి వారీగా సీట్ల వివరాలు, షెడ్యూల్, నోటిఫికేషన్, హెల్ప్‌డెస్క్) మే 31వ తేదీ ఉదయం 10:00 గంటల నుంచి క్రీడా శాఖ వెబ్‌సైట్ https://apsportsschool.ap.gov.in/ లో అందుబాటులో ఉంది.
ప్రవేశ ప్రక్రియ కోసం తాత్కాలిక షెడ్యూల్:
డిపార్ట్‌మెంట్ ద్వారా అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ & సమాచార ప్రచురణ 30.05.2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 31.05.2025
దరఖాస్తు ముగింపు తేదీ 19.06.2025
ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన
21.07.2025 - 23.07.2025
అభ్యర్థులకు కాల్ లెటర్ జారీ & అభ్యర్థుల అడ్మిషన్ ప్రక్రియ
24.07.2025 నుంచి అని సంబంధిత అధికారులు తెలిపారు.