Politics2nd Sep 12:35 PMSunil Byrisetty1 min read

జనహృదయ నేత.. వైయస్సార్

రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాలో జన్మించి రాష్ట్ర రాజకీయాలను శాసించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నేడు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 3 సార్లు మంత్రిగా, 2 సార్లు ముఖ్యమం

జనహృదయ నేత.. వైయస్సార్
రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాలో జన్మించి రాష్ట్ర రాజకీయాలను శాసించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నేడు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 3 సార్లు మంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలతో మమేకమైన నాయకుడు వైయస్ఆర్. 33 ఏళ్లకే పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన ఆయన… ముఖ్యమంత్రిగా ఉన్నది 5 ఏళ్ల 3 నెలల 19 రోజులు మాత్రమే. కానీ ఆ కొద్ది కాలంలోనే పేదవాడి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ, రైతన్నకు ఉచిత విద్యుత్, ఆపదలో ఉన్నవారికి 108, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు… ఇలా పథకాల పేర్లు ఎన్నో… వాటితో మారిన జీవితాలు మాత్రం కోట్లలో.. అధికారంలో ఉన్న కాలం కొద్దే.. ప్రజల గుండెల్లో వేసిన ముద్ర మాత్రం శాశ్వతం. ఇదే రోజున హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినా తెలుగు రాజకీయాలే కాదు తెలుగు ప్రజలు మర్చిపోని నేతగా నిలిచారు.
Andhra Pradesh Politics
YS Rajasekhara Reddy
YSR
YSR Death Anniversary
YSR Memorial Day
AP Politics
Kadapa
YSR Legacy
YSR Government
ఆరోగ్యశ్రీ
ఉచిత విద్యుత్
108 అంబులెన్స్
ఫీజు రీయింబర్స్‌మెంట్
ఇందిరమ్మ ఇళ్లు
రైతుల సంక్షేమం
Scroll for the next article