Politics13th Aug 11:31 AMSunil Byrisetty1 min read

గ్రూప్-1 స్కామ్ దాచేందుకు డీఎస్సీపై ఆరోపణలు?

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల్లో జరిగిన కుంభకోణాన్ని దాచేందుకే డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టిందా? అంటే అవుననే అభిప్రాయాలు వినిపిస్తున్నా

గ్రూప్-1 స్కామ్ దాచేందుకు డీఎస్సీపై ఆరోపణలు?
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల్లో జరిగిన కుంభకోణాన్ని దాచేందుకే డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టిందా? అంటే అవుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒకే జవాబు పత్రాన్ని మూడుసార్లు మూల్యాంకనం చేసి, కష్టపడి చదివిన వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును గత ప్రభుత్వం గందరోళంలోకి నెట్టిందంటున్నారు. 7 సిఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ నివేదికలు, 173 మంది సాక్షుల వాంగ్మూలాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హైకోర్టులో నివేదిక దాఖలు చేసింది. ఎంపికైన 165 మందిలో ఏకంగా 160 మంది మార్కుల్లో అక్రమ మార్పులు జరిగాయని, కోర్టుకెక్కిన 405 మంది అర్హుల ఓఎంఆర్ షీట్లలో మార్కులు తగ్గించి వారి అవకాశాలను తొక్కేశారని సిట్ ఆధారాలతో చూపించింది. అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్-1 పేపర్లు అమ్ముకుని, నేడు DSCపై డ్రామాలాడుతున్నారంటూ వైసీపీ నేతలపై విమర్శలు వస్తున్నాయి.
Andhra Pradesh
APPSC Group 1
Group 1 Scam
DSC Scam
DSC Controversy
YSRCP
SIT Investigation
Forensic Report
APPSC
Recruitment Scam
OMR Sheets
Recruitment Irregularities
Scroll for the next article