News20th Mar 03:05 PMSunil Byrisetty1 min read

హజ్ యాత్రకు ఎంబార్కేషన్ పాయింట్ తొలగించడం బాధాకరం

గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎంతో ప్రయాసలతో, కష్టపడి ఇక్కడ పాయింట్ సాధించామని మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల విజయవాడ ఎంబర్కేషన

హజ్ యాత్రకు ఎంబార్కేషన్ పాయింట్ తొలగించడం బాధాకరం
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎంతో ప్రయాసలతో, కష్టపడి ఇక్కడ పాయింట్ సాధించామని మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మన రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లాలంటే వేరే ప్రాంతాల నుండి వెళ్ళేవారన్నారు. 2019లో కూడా హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హాజీలు యాత్రకు వెళ్లారని, అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర హజీలకు సరైన సదుపాయాలు కల్పించలేదని వివరించారు. ఆ తర్వాత మన రాష్ట్రం నుండే హజీలను హజ్ యాత్రకు పంపించాలని అప్పటి సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లామని, 2020లో మన రాష్ట్రం విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. 2020, 2021 రెండేళ్లు కరోనా నేపథ్యంలో హజ్ యాత్ర జరగలేదని, 2022 లో కూడా తక్కువ మందిని మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతించిందని వివరించారు. 2023లో కేంద్ర ప్రభుత్వానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం లేఖ రాయగా.. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1813 మంది హజ్ యాత్రకు వెళ్లే అవకాశం కల్పించిందన్నారు. అదనపు భారాన్ని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఉత్తర్వులు జారీచేసిందని గుర్తు చేశారు. ఇంత కష్టపడి సాధించిన ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడం బాధాకరమని, ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమేనని, మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విస్మరించారని అంజాద్ బాషా పేర్కొన్నారు.
haz terminal
Amjad basha
Ysrcp
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా
Scroll for the next article