Politics16th Jun 11:25 AMSunil Byrisetty1 min read

ఏడాదిగా ఏపీలో రెడ్ బుక్ పాలన!

సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ఈ పరిపాలన అంతగా పుస్తకం రూపంలో ప్రజల దగ్గరకి తీసుకొచ్చామన్నా

ఏడాదిగా ఏపీలో రెడ్ బుక్ పాలన!
సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ఈ పరిపాలన అంతగా పుస్తకం రూపంలో ప్రజల దగ్గరకి తీసుకొచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ప్రజలను మోసం చేసిందని, అదంతా ఈ పుస్తకంలో పొందుపరిచామని వివరించారు. వరదలు వచ్చి విజయవాడ మునిగితే ఇప్పటికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. 30 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి రెడ్ బుక్ చూపించి భయపెడుతున్నారని ఆరోపించారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 95 శాతం హామీలు నెరవేర్చిందని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి నియోజకవర్గంలో, మండలంలో, గ్రామంలో ఆవిష్కరిస్తామని అవినాష్ చెప్పారు.
Andhra Pradesh news
AP Politics
YSRCP
devineni Avinash
TDP Red book rule
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పాలన
ప్రభుత్వం సంవత్సరం కాలంలో ప్రజలను మోసం
Scroll for the next article