Politics1st Mar 12:10 PMSunil Byrisetty1 min read
బడ్జెట్ బుక్ కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: మాజీ మంత్రి బుగ్గన
రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ... కంటెంట్ తక్కువ కనిపిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల అమలును చూస్తే తొలి ఏడాది బడ్జెట్లో మ
రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ... కంటెంట్ తక్కువ కనిపిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల అమలును చూస్తే తొలి ఏడాది బడ్జెట్లో మొండిచేయి చూపించినట్లే ఈ బడ్జెట్లో కూడా చేశారన్నారు. దీపం పథకం కింద అర్థదీపం, పావు దీపం అమలు చేశారని ఎద్దేవా చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేసినంత అప్పు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదని, ఒక్క ఏడాదిలోపే రూ.1.19 కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగం చూస్తే గత ప్రభుత్వం గురించి 25 సార్లు, విధ్వంసం గురించి మరో 10 సార్లు ప్రస్తావించారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి పదినెలలు అవుతోంది, ఇకనైనా ప్రజలకు ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల అమలు గురించి ఇకనైనా చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగిందే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై. ప్రతి ఇంటికి తిరిగి హామీలను పదేపదే చెప్పి ప్రజలను నమ్మించారని బుగ్గన విమర్శించారు.