Politics22nd Dec 12:14 PMSunil Byrisetty1 min read
డీలిమిటేషన్ అయితే వైసీపీకి 200 సీట్లు పక్కా?
వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, 2029 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. "ఈసారి 200 కంటే ఎక్కువ సీట్లతో భారీ మెజారిటీ సాధించి మళ్లీ ప్ర
వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, 2029 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. "ఈసారి 200 కంటే ఎక్కువ సీట్లతో భారీ మెజారిటీ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం," అని ఆయన జోస్యం చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 200కు పైగా సీట్లు గెలుస్తామని, ఒకవేళ 175 స్థానాలే కొనసాగితే గతంలో సాధించిన 151 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు ముందుకు తీసుకెళ్తామని అన్నారు. 2019 నుంచి 2024 మధ్య జగన్ పాలనలో రాష్ట్రం 15-20 ఏళ్ల అభివృద్ధి సాధించిందని సజ్జల కొనియాడారు. ఐదేళ్ల కాలంలోనే ఐదు దశాబ్దాల ప్రగతిని చూపించారని, ప్రజలు అప్పులపాలు కాకుండా తమ తలరాతను తామే రాసుకునేలా చేశారని తెలిపారు. "కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబ సంక్షేమానికే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. క్రమశిక్షణ, విశ్వసనీయతతో కూడిన నాయకత్వంతో సామాన్య కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు," అని పేర్కొన్నారు. హామీ ఇవ్వని అంశాలను కూడా అమలు చేశారే తప్ప, ఎక్కడా తప్పుడు వాగ్దానాలు చేయలేదని గుర్తుచేశారు.