Politics25th Jun 05:36 PMSunil Byrisetty1 min read
రీకాలింగ్ మేనిఫెస్టో.. ఎంత నష్టపోయారో క్యూఆర్..!
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నామన్
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నామన్నారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుందని వివరించారు. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఆ స్థాయి నాయకుల ప్రెస్‌కాన్ఫరెన్స్.. నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, అందరికీ అర్థమయ్యేలా వివరించాల్సి ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఏం చెప్పారో పథకాల వారీగా వివరిస్తూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు.