News24th May 11:30 AMSunil Byrisetty1 min read

నేను మారలేదు నువ్వే మారిపోయావన్న విజయసాయి

‘నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నువ్వే పదవి వచ్చాక మారిపోయావు! మూడు దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంది. పెళ్ళి చేసుకున్న వారే విడిపోతున్నారు, మాద

నేను మారలేదు నువ్వే మారిపోయావన్న విజయసాయి
‘నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నువ్వే పదవి వచ్చాక మారిపోయావు! మూడు దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంది. పెళ్ళి చేసుకున్న వారే విడిపోతున్నారు, మాది రాజకీయ బంధం, ఇందులో ఆశ్చర్యం ఏముంది? ప్రలోభాలకు లొంగను, ఎవ్వరికీ భయపడను, విశ్వసనీయత కోల్పోయే తత్వం కాదు. మద్యం కేసు సిట్ చూస్తోంది. కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. భవిష్యత్ లో ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే చెబుతానేమో! భక్తి ఇప్పుడూ ఉంది అప్పుడూ ఉంది. కాకపోతే గతంలో మా నాయకుడి మీద ఉండేది. ఇప్పుడు దేవుడి మీద మాత్రమే ఉంది. ఆయనకు ఇంకా నాగురించి ఏమి తెలియదు. నేను ఎవ్వరి ప్రలోభాలకు లొంగే రకం కాదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్నో బాధలు పడ్డాను. అయినా అక్కడ ఉంటే నా బాధలు తగ్గవని అర్ధమైంది. అందులోంచి తప్పుకున్నాను. ప్రశాంతంగా హాయిగా వున్నాన’ని మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్ పత్రికా సమావేశంలో విజయసాయి గురించి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
Andhra Pradesh
Ys Jagan Mohan Reddy
Vijayasai Reddy
మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి
వైయస్ జగన్
Scroll for the next article