Politics29th Oct 05:48 PMSunil Byrisetty1 min read
పెన్షన్ల పంపిణీతో టీడీపీ లబ్ధి
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు 'వైసీపీ' లేఖ రాసింది. ఈ నెల 30న సామాజిక పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే పింఛన్ల పంపిణీ పేరుతో ఓటర్లను ప్రభావితం
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు 'వైసీపీ' లేఖ రాసింది. ఈ నెల 30న సామాజిక పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే పింఛన్ల పంపిణీ పేరుతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వైసీపీ లేఖలో ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పింఛన్ల పంపిణీ జరగాలని వైసీపీ విజ్ఞప్తి చేసింది. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని లేఖలో వైసీపీ కోరింది. అయితే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ ఆరోపిస్తోంది.