Politics10th Sep 04:48 PMSunil Byrisetty1 min read
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ బాషా అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను
కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ బాషా అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే ప్రధాన అజెండాగా ఈ సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికార బలంతో ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం, కార్యకర్తల బలం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సగం కాలం పూర్తయిందని, టీడీపీ పాలనకు ఇంటర్వెల్ అయిపోయిందని నాయకులు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి పాలనపై చర్చ జరుగుతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరోసారి వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.