TTD1st Jun 10:52 AMSunil Byrisetty1 min read
శ్రీవారి సన్నిధిలో వైసీపీ కుట్రలు!
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైసీపీ కుట్రలు చేస్తోందంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధిలో వైసీపీ కుట్రలు సరికాదన్నారు. దర్శన కంపార్ట్ మెంట్‍లో వైసీ
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైసీపీ కుట్రలు చేస్తోందంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధిలో వైసీపీ కుట్రలు సరికాదన్నారు. దర్శన కంపార్ట్ మెంట్‍లో వైసీపీ నేత అచ్చారావు నిరసన చేశారని చెప్పారు. పథకం ప్రకారం అచ్చారావుతో వైసీపీ పేటీఎం బ్యాచ్ డ్రామా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చారావుతో డ్రామా ఆడించి సోషల్ మీడియాలో వీడియో పెట్టారన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. పవిత్రమైన తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.