News28th Aug 04:16 PMSunil Byrisetty1 min read

స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర

ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ చేశారు. స్థానిక ఎన్నికలు జరగటం వైసీపీ నాయకుడికి ఇష్టం లేదన్నారు. స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ అధినేత యత్నిస్తున్నారని

స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర
ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ చేశారు. స్థానిక ఎన్నికలు జరగటం వైసీపీ నాయకుడికి ఇష్టం లేదన్నారు. స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ అధినేత యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వాయిదా పడితే.. వైసీపీకి లాభం అనుకోవడం దింపుడుకళ్లెం ఆశలేనన్నారు. స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితేనే రాజకీయ స్థిరత్వం ఉంటుందని అన్నారు. ఏ ఎన్నికల్లోనైనా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేది టీడీపీనేనని తెలిపారు. బీసీలకు 34 శాతం సీట్లు అనేది చట్టపరమైన రక్షణ మాత్రమేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 34శాతం కంటే ఎక్కువ సీట్లే బీసీలకు ఇచ్చామను సీఎం చంద్రబాబు అన్నారు.
Andhra Pradesh Politics
BC Reservations
Backward Classes
Chandrababu Naidu
YSRCP
TDP
Local Body Elections
Local Elections
బీసీ రిజర్వేషన్లు
వెనుకబడిన తరగతులు
రాజకీయ స్థిరత్వం
ఎన్టీఆర్ భవన్
ఎన్నికల వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Scroll for the next article