Politics10th Aug 04:03 PMSunil Byrisetty1 min read

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో విజ

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ నాయకులు కలిసి రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విద్యాశాఖలో చోటుచేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్రంలో మంత్రి రాజీనామా చేసినట్లే, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు, సవరించిన జీవోల పేరుతో తీవ్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
Andhra Pradesh
DSC Recruitment
DSC Irregularities
CBI Investigation
YSRCP
Malladi Vishnu
Nara Lokesh
నారా లోకేష్
విద్యాశాఖ
విజయవాడ నిరసన
స్పోర్ట్స్ కోటా
Scroll for the next article