Politics21st Jul 12:58 PMSunil Byrisetty1 min read

ఏపీలో కూటమి రెడ్ బుక్ రాజ్యాంగం

ఏపీలో కూటమి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరోపించారు. రెండేళ్లలో మహిళల పై హత్యలు,అత్యాచారాలు పెరిగాయన్నారు. గుంటూరులో మహిళను వివస్త్ర చేసి దారుణంగా

ఏపీలో కూటమి రెడ్ బుక్ రాజ్యాంగం
ఏపీలో కూటమి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరోపించారు. రెండేళ్లలో మహిళల పై హత్యలు,అత్యాచారాలు పెరిగాయన్నారు. గుంటూరులో మహిళను వివస్త్ర చేసి దారుణంగా అవమానించారని, ఈ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. గుంటూరు బాధిత మహిళకు అండగా వైసిపి మహిళా విభాగం తరపున యుద్ధం మొదలుపెట్టామని చెప్పారు. హోంమంత్రి అనిత తన శాఖ పని తప్ప మిగిలిన అన్ని పనులూ చేస్తున్నారని విమర్శించారు. మహిళల పై దాడులు చేసిన వారి పై చర్యలు తీసుకుంటే మంత్రి గౌరవం పెరుగుతుందని సూచించారు. స్టేషన్లకు వచ్చే మహిళల ఫిర్యాదులను పోలీసులు బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Women Safety
Guntur Incident
Kalpalatha Reddy
YSRCP
ఏపీ రాజకీయాలు
హోంమంత్రి అనిత
శాంతిభద్రతలు
ప్రతిపక్షం
Scroll for the next article