Politics19th Mar 05:41 PMSunil Byrisetty1 min read

రాయలసీమ అభివృద్ధి వైసీపీకి ఇష్టం లేదు.

హంద్రీనీవా ఎత్తిపోతలకు సంబంధించి బుధవారం శాసనమండలిలో వాడి వేడి చర్చ జరిగింది. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులకు సంబంధించి వైకాపా సభ్యుడు అసలు లైనింగే వద్దు అనగానే జల వనరుల శాఖ మంత్రి

రాయలసీమ అభివృద్ధి వైసీపీకి ఇష్టం లేదు.
హంద్రీనీవా ఎత్తిపోతలకు సంబంధించి బుధవారం శాసనమండలిలో వాడి వేడి చర్చ జరిగింది. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులకు సంబంధించి వైకాపా సభ్యుడు అసలు లైనింగే వద్దు అనగానే జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా స్పందించారు. మీకు లైనింగే కాదు రాయలసీమ అభివృద్ధి కూడా అవసరం లేదు. రాయలసీమ ప్రాంత ప్రజలు అభివృద్ధిచెంది, బాగుపడితే మీ అవినీతి వైకాపా పాలనను ఎక్కడ ప్రశ్నిస్తారోనని, భయపడుతున్నారని విమర్శించారు. అందుకే మేము చేసే అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డు తగులుతూ, అసంబద్ధ ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజలకు అబద్ధాలు నూరి పోస్తున్నారు అంటూ ఘాటుగా విమర్శించారు. ఐదేళ్లపాటు హంద్రీనీవా వైపు కన్నెత్తి చూడని తాడేపల్లి రాజప్రసాదం, పరదాలకు పరిమితమైన వైయస్ జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిన ప్రశ్నలు, పనులు చేస్తున్న మమ్మల్ని అడగటం విడ్డూరంగా ఉందని నిమ్మల ఎద్దేవా చేశారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు చేసి 6,200 క్యూసెక్కుల నీరు వదలాలని ఉత్తుత్తి జీవో ఇచ్చి పైసా పని కూడా చేయకుండా వదిలేసిన అప్పటి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. లైనింగ్ తప్పు అంటున్న మీరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తే అది ఎలా ఒప్పుఅవుతుంది. అధికారంలో ఉంటే ఒకలా, అధికారం కోల్పోతే మరోలా, మాట్లాడటం వైకాపా మేధావులకు సబబు కాదు అని నిమ్మల చురకలంటిoచారు. 2019 నాటికే చంద్రబాబు ఏర్పాటు చేసిన 3850 క్యూసెక్కుల సామర్ద్య పంపులను కూడా ఉపయోగించి, నీరు తీసుకురాలేని వైసిపికి, హంద్రీనీవాపై మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ పాలనలో గాలేరు-నగరి కెనాల్ కు లైనింగ్ చేశారు. ఆనాడు దాన్ని వ్యతిరేఖించని వైకాపా అనుకూల మేధావులు, నేడెందుకు హంద్రీనీవా పై మాట్లాడుతున్నారు. రాజకీయ లబ్దికోసం కాదా? అంటూ ప్రశ్నించారు.
Rayalaseema
Minister Nimmala Ramanaidu
హంద్రీనీవా ఎత్తిపోతల
జగన్మోహన్ రెడ్డి
Scroll for the next article