Politics28th Aug 09:29 AMSunil Byrisetty1 min read
స్థానికానికీ మాజీలే? వైసీపీ గెలుపు వ్యూహం!
గత సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ సీట్లకే పరిమితమైన వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు చాలా చోట్ల పార్టీకి
గత సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ సీట్లకే పరిమితమైన వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు చాలా చోట్ల పార్టీకి అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. అలాగే చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓడిపోయి సైలెంటైపోయారు. వారందరినీ యాక్టివ్ చేసేందుకు పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మేయర్, చైర్మన్ అభ్యర్థులుగా వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలను నిలబెట్టాలని భావిస్తున్నారట. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ పీఠాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనుండటంతో బలమైన నేతలు నిలబడితే గెలవవచ్చని జగన్ భావనగా తెలుస్తోంది.
ఆర్థిక స్థోమత ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు , మాజీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులనే బరిలోకి దించే ఆలోచన చేస్తున్నారట.
కొన్ని స్థానాలు సాధించినా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందనే నరేటివ్‌ను బలంగా తీసుకెళ్లవచ్చని, ఓడిపోతే 2029 ఎన్నికల్లో సీట్లు లేవని చెప్పొచ్చని వారి ప్లాన్ గా చర్చ జరుగుతోంది.