Politics27th Aug 03:33 PMSunil Byrisetty1 min read

ఏకగ్రీవాలు లేకుండా సాధ్యమేనా? వైసీపీలో తర్జనభర్జన

రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అంగీకరించేది లేదని వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థులను పోటీకి పెట్టాలని ఇచ్చిన ఆదేశాలు చర్చకు దారితీస్తున్నా

ఏకగ్రీవాలు లేకుండా సాధ్యమేనా? వైసీపీలో తర్జనభర్జన
రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అంగీకరించేది లేదని వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థులను పోటీకి పెట్టాలని ఇచ్చిన ఆదేశాలు చర్చకు దారితీస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోగలమా అని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఏకగ్రీవాలను ప్రోత్సహించామని, ఇప్పుడు వద్దంటే ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏకగ్రీవాలు అయ్యే చోట సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులపై చర్యలు ఉంటాయని అధినేత హెచ్చరికలతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో ఏకగ్రీవాలు జగరకుండా పోరాడటం అంటే చాలా వ్యవప్రయాసలతో కూడిన అంశంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు భావిస్తున్నారని చెబుతున్నారు. అధినేత ఆదేశాలతో స్థానిక ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయో గానీ వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతల్లో మార్పు మాత్రం తీసుకువస్తుందని అంచనా.
Andhra Pradesh Politics
YSRCP
YS Jagan Mohan Reddy
Local Body Elections
Unopposed Elections
YSRCP Candidates
Political Strategy
అసెంబ్లీ నియోజకవర్గాలు
వైసీపీ నాయకత్వం
ఏపీ రాజకీయాలు
ఎన్నికల సన్నాహాలు
Scroll for the next article