Politics7th Aug 11:19 AMSunil Byrisetty1 min read
పార్లమెంట్‌లో నవ్వులపాలైన వైసీపీ!
పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీకి ఊహించని వరుస షాకులు తగులుతున్నాయి. ఏదో చేద్దామనుకుంటే తమ పరువే పోగొట్టుకున్నట్లయింది. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేద్దామనుకుని, గత ప్రభు
పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీకి ఊహించని వరుస షాకులు తగులుతున్నాయి. ఏదో చేద్దామనుకుంటే తమ పరువే పోగొట్టుకున్నట్లయింది. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేద్దామనుకుని, గత ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిపై వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలే బూమరాంగ్ అయి ఆ పార్టీ గత ఐదేళ్ల అసమర్థ పాలన, నిధుల వినియోగంలో చూపిన ఉదాసీనతను ఎండగట్టేలా మారాయి. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు ఇచ్చిన అధికారిక సమాధానాలతో వైసీపీ అభాసుపాలైంది. అంతే కాకుండా, ఎంపీలు అడిగిన ప్రశ్నలతో స్వయంగా 'సెల్ఫ్ గోల్' వేసుకుని నవ్వులపాలయ్యారు. వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు ఏపీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26 నాటికి ఏకంగా ఆరురెట్లు పెరిగాయని సమాధానం వచ్చింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభిమ్) అమలుపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని, కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి గణనీయంగా మెరుగైందని వెల్లడైంది.
మూలధన వ్యయం కోసం కేంద్రం అందించే వడ్డీలేని రుణాల రూపంలోని సాస్కీ నిధులపైనా పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీలు తమ పరువు తామే తీసుకున్నట్లయిందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.