Politics22nd Oct 03:02 PMSunil Byrisetty1 min read

టీడీపీ కన్నా వైసీపీ నామినేషన్లే ఎక్కువ

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నేత కొమ్మారెడ

టీడీపీ కన్నా వైసీపీ నామినేషన్లే ఎక్కువ
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిజంగా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే అన్ని పార్టీలకు సంబంధించిన 23 వేలకుపైగా నామినేషన్లు ఏ విధంగా ఫైల్ అయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా వైసీపీ నామినేషన్లు దాఖలు చేయలేదా అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో నామినేషన్లు ఫైల్ చేశారు కదా అనడిగారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు అరాచకాలు ఇప్పుడు లేవని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి నిన్న(బుధవారం) నామినేషన్ల ప్రక్రియ మొదలైతే మొత్తం 9829 ఎంపీటీసీ స్థానాల్లో 5267 నామినేషన్లు ఫైలయ్యాయని, అందులో టీడీపీ 2719, వైసీపీ 1918 నామినేషన్లు ఎలా ఫైల్ అయ్యాయని నిలదీశారు. ప్రభుత్వం ఆపితే ఇన్ని ఫైల్ అవుతాయా అని ప్రశ్నించారు. 659 జడ్పీటీసీ స్థానాల్లో 409 నామినేషన్లు తొలి రోజు ఫైల్ అయ్యాయని, వాటిలో వైసీపీవే 192 ఉన్నాయని స్పష్టం చేశారు. టీడీపీ 128 నామినేషన్లు దాఖలు చేస్తే, వైసీపీ ఇంకా ఎక్కువ ఫైల్ చేసిందని పేర్కొన్నారు.
Scroll for the next article