Politics2nd Aug 05:41 PMSunil Byrisetty1 min read
దోచింది దాచుకునేందుకే సింగపూర్ టూర్!
అవినీతి సొమ్మును దాచుకునేందుకే సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు సింగపూర్‌లో పర్యటించారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వి
అవినీతి సొమ్మును దాచుకునేందుకే సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు సింగపూర్‌లో పర్యటించారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖలో మాట్లాడుతూ తండ్రీకొడుకుల అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ చేసిందని అన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కంపెనీలు ఏపీకి రాకుండా వైయస్ఆర్‌సీపీ ఈ మెయిల్స్ రాస్తోందంటూ మంత్రి లోకేష్ మీడియా ముందు కట్టుకథలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు తీసుకురావడానికి సింగపూర్ పర్యటనకి వెళ్తున్నట్టు చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు తెచ్చారని అడిగారు. చంద్రబాబు ఏడాది పాలన చూసి, కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు భయపడి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని విమర్శించారు.