Politics30th Aug 05:43 PMSunil Byrisetty1 min read
రుషికొండ రిసార్ట్స్ పై కూటమి నేతల విషప్రచారం
విశాఖ నగరానికి తలమానికంగా గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్‌పై వైయస్ జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు కూతలు కూసిన కూటమి నేతలు ఈరోజు వాటిని ప్రభుత్వ భవనాలుగా పేర్కొంటూ జీఓ ఎలా జ
విశాఖ నగరానికి తలమానికంగా గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్‌పై వైయస్ జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు కూతలు కూసిన కూటమి నేతలు ఈరోజు వాటిని ప్రభుత్వ భవనాలుగా పేర్కొంటూ జీఓ ఎలా జారీ చేశారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్నం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రిషికొండ రిసార్ట్స్‌పై చంద్రబాబు, పవన్, లోకేష్‌లు ఎలాంటి దుష్ప్రచారం చేశారో మరిచిపోయారా అని నిలదీశారు. ప్రభుత్వ పరంగా నిర్మించిన ఈ నిర్మాణాలపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన నేతలు ఇప్పుడు వాటిని ప్రభుత్వ భవనాలే అంటూ సమర్థించుకుంటున్నారని, గతంలో తాము చేసిన విష ప్రచారానికి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తమ ప్రభుత్వంలో నిర్మించిన రుషికొండ రిసార్ట్స్ కూటమి నేతలకు పొలిటికల్ టూరిజం డెస్టినేషన్ గా మారిందని అమర్నాథ్ గుర్తు చేశారు.