Politics6th Nov 03:35 PMSunil Byrisetty1 min read

వైసీపీకి ఓటడిగే అర్హత లేదు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీపై తిరగబడి కూటమికి 94 నుంచి 95 శాతం చారిత్రక విజయాన్ని కట్టబెట్టారని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు స్పష్టం చేశారు.రాష్ట్రంలో జెడ్

వైసీపీకి ఓటడిగే అర్హత లేదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీపై తిరగబడి కూటమికి 94 నుంచి 95 శాతం చారిత్రక విజయాన్ని కట్టబెట్టారని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు స్పష్టం చేశారు.రాష్ట్రంలో జెడ్పీటీసీలు, ప్రధాన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసిందని, త్వరలోనే పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయని పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలు వేరు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరు అని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలే అసలైన గ్రామీణ ప్రజల నాడిని, వారి నిజమైన అభిప్రాయాలను స్పష్టంగా ప్రతిబింబిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే తరహా చారిత్రక తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఆ చీకటి రోజులు ముగిసి, ఇప్పుడు ఆ గ్రహణం వీడిపోయిందని, గ్రామాల్లో మళ్లీ వికాసం మొదలవుతోందని వివరించారు. గ్రామీణ ప్రజలు ఇవన్నీ గమనించారు కాబట్టే, ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ కూటమికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని అశోక్ బాబు పేర్కొన్నారు.
Scroll for the next article