News17th Aug 12:22 PMSunil Byrisetty1 min read

డీఎస్సీపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు

ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పేరుతో ఆశలు చూపి, చివరకు వారిని నట్టేట ముంచిన వైసీపికి డీఎస్సీ నియామకాలపై మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని మంత్రి కింజరాపు అ

డీఎస్సీపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు
ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పేరుతో ఆశలు చూపి, చివరకు వారిని నట్టేట ముంచిన వైసీపికి డీఎస్సీ నియామకాలపై మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు ఒక్క మెగా డీఎస్సీ కూడా ఇవ్వలేకపోయిన వైసీపీ ఈరోజు డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నీతులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఐదేళ్లు యువత జీవితాలతో ఆడుకున్న మీరా ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడేదని నిలదీశారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉండి మెగా డీఎస్సీ ఇస్తామని నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించిందని, ఆ ప్రకటనలను నమ్మి వేలాది మంది యువత అప్పులు చేసి మరీ శిక్షణ తీసుకుని, ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు చదివారని మంత్రి పేర్కొన్నారు. చివరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా వారి ఆశలను అడియాసలు చేసి, భవిష్యత్తుతో చెలగాటమాడారని మండిపడ్డారు.
Andhra Pradesh
YSRCP
Atchannaidu
DSC Recruitment
Teacher Recruitment
Mega DSC
Unemployed Youth
Education
నిరుద్యోగ యువత
విద్యారంగం
టీచర్ ఉద్యోగాలు
నియామకాల వివాదం
Scroll for the next article