Politics24th Oct 05:16 PMSunil Byrisetty1 min read

చంద్రబాబు ఆరోపణలపై స్పందించిన వైసీపీ

చంద్రబాబు ఆరోపణలపై వైసీపీ స్పందించింది. షర్మిలకు YS జగన్ రాసిన లేఖను విడుదల చేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు రావణకాష్టంగా మార్చారని, పక్కా ప్రణాళికాబద్ధమైన దాడులతో.. స్థానిక ఎన్నికల

చంద్రబాబు ఆరోపణలపై స్పందించిన వైసీపీ
చంద్రబాబు ఆరోపణలపై వైసీపీ స్పందించింది. షర్మిలకు YS జగన్ రాసిన లేఖను విడుదల చేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు రావణకాష్టంగా మార్చారని, పక్కా ప్రణాళికాబద్ధమైన దాడులతో.. స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని పేర్కొంది. ఆ విషయాలను పక్కదోవపట్టించడానికే జగన్‌పై వ్యక్తిగత దాడి చేయడం దారుణమని మండిపడింది. నామినేషన్ కేంద్రాలనే దాడులకు అడ్డాలుగా మార్చారని, చంద్రబాబు చేయించిన దాడులతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని వ్యాఖ్యానించింది. YSRCP న్యాయపోరాటంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు.. రాష్ట్రంలోని పరిస్థితులను బట్టబయలు చేశాయని స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికల్లో జరిగిన దాడులు, అక్రమాలపై.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని పేర్కొంది.
Scroll for the next article