News8th Aug 12:44 PMSunil Byrisetty1 min read
DSC అవకతవకలపై వైసీపీ రిలే నిరాహార దీక్ష
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మంగళగిరిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. YSRCP మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొం
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మంగళగిరిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
YSRCP మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగింది. ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. DSC నియామకాల్లో 400 నుంచి 500 వరకు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై వెంటనే CBI విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. అధికారులు నిజాన్ని దాచిపెడుతున్నారని, ఏమీ జరగలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.జగన్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కూడా కళాశాలలకు విడుదల చేయడం లేదని, దీంతో విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోయాయని, చిన్న ఉద్యోగాలకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. చదువుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం, ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలని కోరారు.