News16th Oct 05:25 PMSunil Byrisetty1 min read

వైసీపీ గుండాగిరిని సహించం

పుంగనూరు, తిరుపతిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, కూటమి అభ్యర్థుల నామినేషన్ల అడ్డగింతకు సంబంధించిన ఘటనలపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ

వైసీపీ గుండాగిరిని సహించం
పుంగనూరు, తిరుపతిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, కూటమి అభ్యర్థుల నామినేషన్ల అడ్డగింతకు సంబంధించిన ఘటనలపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణుల చేసిన దాడులను ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను గుండాగిరితో అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అభ్యర్థులపై దాడులు చేసి, నామినేషన్‌ పత్రాలు చించేసి ప్రజాతీర్పును మార్చగలమనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మహిళలను గాయపరిచి, వాహనాలను ధ్వంసం చేయడమే వైసీపీ రాజకీయమా అని నిలదీశారు. పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని, కారుతో ఢీకొట్టి నామినేషన్ల కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడంపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎంపీగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి నామినేషన్లనే అడ్డుకుంటారా? గత ప్రభుత్వ హయాంలో సాగించిన గుండాగిరినే ఇప్పుడూ చలామణి చేయాలని చూస్తున్నారా? కారుతో కార్యకర్తలను ఢీకొట్టడం, నాయకులపై దాడులకు దిగడం రాజకీయమా? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే దౌర్జన్యాలను సహించేది లేదు అని హెచ్చరించారు.
Scroll for the next article