Politics8th Aug 03:56 PMSunil Byrisetty1 min read

వైసీపీ ఓ 'క్రిమినల్స్ ఫ్యాక్టరీ' అన్న మంత్రి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి సవిత తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగ

వైసీపీ ఓ 'క్రిమినల్స్ ఫ్యాక్టరీ' అన్న మంత్రి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి సవిత తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పరిశ్రమలను ఆహ్వానిస్తూ, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భావితరాల భవిష్యత్తుకు బంగారు పునాదులు వేస్తున్నామన్నారు. అయితే వైసీపీ మాత్రం హత్యా రాజకీయం, విధ్వంసాలతో అభివృద్ధికి అడ్డుపడుతోందని విమర్శించారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, అది కేవలం నేరస్తుల ముఠా అని మండిపడ్డారు. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా నేర రాజకీయాలు మానలేదని మండిపడ్డారు.
Andhra Pradesh
Minister Savitha
YSRCP
TDP
AP Politics
Coalition Government
Chandrababu Naidu
కూటమి ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు
సుపరిపాలన
అభివృద్ధి
సంక్షేమం
రాజకీయ ఆరోపణలు
రాజకీయ వార్తలు
Scroll for the next article