Politics3rd Oct 12:02 PMSunil Byrisetty1 min read

హోటల్‌పై వైసీపీ నేత దౌర్జన్యం

పల్నాడు జిల్లాలో వైసీపీ నేత హోటల్ పై దౌర్జన్యానికి దిగారు. ఆహారం అందించడం ఆలస్యమైందనే కారణంతో వైసీపీ నేత నాగార్జున యాదవ్, ఆయన అనుచరులు సత్తెనపల్లిలోని హోటల్ సిబ్బందిపై దాడి చేశారు.

హోటల్‌పై వైసీపీ నేత దౌర్జన్యం
పల్నాడు జిల్లాలో వైసీపీ నేత హోటల్ పై దౌర్జన్యానికి దిగారు. ఆహారం అందించడం ఆలస్యమైందనే కారణంతో వైసీపీ నేత నాగార్జున యాదవ్, ఆయన అనుచరులు సత్తెనపల్లిలోని హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లిలోని గుడ్‌మార్నింగ్ హోటల్‌కు వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తన అనుచరులతో కలిసి వెళ్లారు. అక్కడ తాము ఆర్డర్ చేసిన ఆహారం తీసుకురావడం ఆలస్యం కావడంతో ఆగ్రహానికి గురై హోటల్ యజమాని శేఖర్‌తో పాటు ఇతర సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో నాగార్జున యాదవ్, ఆయన అనుచరులు సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వైసీపీ నేతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Andhra Pradesh News
Political Violence
YSRCP
Palnadu
Hotel Attack
Nagarjuna Yadav
Law and Order
Sattenapalli
హోటల్‌పై వైసీపీ నేత దౌర్జన్యం
Scroll for the next article