News31st Jan 11:36 AMSunil Byrisetty1 min read

పవన్ కళ్యాణ్ దుర్గ గుడికి వచ్చి మెట్లు కడగాలి

తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమినేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయ

పవన్ కళ్యాణ్ దుర్గ గుడికి వచ్చి మెట్లు కడగాలి
తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమినేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కోట్లాది మంది ఆరాధ్యంగా బావించే వెంకటేశ్వరస్వామి ప్రసాదం గురించి నోటికొచ్చినట్లు విమర్శలు చేశారన్నారు. కనీస అవగాహన లేకుండా వైసీపీ పై అబద్ధాలు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడారని మండిపడ్డారు. సిట్ ఇచ్చిన రిపోర్ట్ దృష్టిలో ఉంచుకొని కూటమి నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ దుర్గ గుడికి వచ్చి మెట్లు కడగాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ పై,, వైసీపీ పై బురద జల్లాలనుకున్నారని, పైన వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నారు, ఎవరినీ వదలరని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Politics
Pawan Kalyan
Tirupati Laddu Issue
YSRCP
Devineni Avinash
NTR District
Political Controversy
Temple Politics
తిరుమల లడ్డూ
సిట్ రిపోర్ట్
కూటమి నేతలు
విజయవాడ
Scroll for the next article