Politics4th Jul 05:17 PMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతల ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నేతృత్వంలో వైసీపీ నేతలు ఫి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నేతృత్వంలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల మృతిచెందిన వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య కేసులో ఆయనను కుక్కలా లాగి పక్కనపడేసారని సీఎం చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలతో దళిత వర్గాలను అవమానపరచారని పేర్కొన్నారు. కుల ప్రాతిపదికన తక్కువ చేసి మాట్లాడటాన్ని ఖండిస్తూ తెనాలికి చెందిన సురేంద్ర తాడేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.