Politics31st Jul 05:04 PMSunil Byrisetty1 min read

కూటమిపై వైసీపీ నేతల కారుకూతలు

అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు కారుకూతలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎవరి బతుకులు ఎలాంటివో..దగ్గర నుంచి చూసిన ఆయా గ్రామాల ప్రజ

కూటమిపై వైసీపీ నేతల కారుకూతలు
అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు కారుకూతలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎవరి బతుకులు ఎలాంటివో..దగ్గర నుంచి చూసిన ఆయా గ్రామాల ప్రజలకు తెలుసని చెప్పారు. జీవితమంతా పచ్చి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలకే పరిమితమని విమర్శించారు. పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే అధికారులకు సూచనలు చేశారు. రెండేళ్ల నమ్మకం..అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా వెంకన్నపాళెం ఎస్టీ కాలనీలో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో వెంకన్నపాళెం పంచాయతీ పరిధిలో అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. రూ.70 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మించి 15 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపించామన్నారు. రెండేళ్ల కూటమి పాలనపై ఇంటింటికీ బ్రోచర్లు అందజేశారు.
Andhra Pradesh
Somi reddy Chandramohan Reddy
YSRCP
TDP
NDA Coalition
అభివృద్ధి
సంక్షేమం
రాజకీయాలు
వెంకన్నపాళెం
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article