Politics7th Aug 03:31 PMSunil Byrisetty1 min read

ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు

ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు కొండెపి సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి అరాచకాలకు పాల్పడిందంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వినతిపత్రం అందజేశారు.

ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు కొండెపి సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి అరాచకాలకు పాల్పడిందంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ 14 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత కొండెపి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి టిడిపి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నామినేషన్లు వేయకుండా ఆది నుంచి అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అన్ని అడ్డంకులను దాటుకుని నామినేషన్లు వేశామని, ఫోర్జరీ సంతకంతో సర్పంచ్ అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరించుకున్నారని వివరించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనని, బెదిరించి, భయపెట్టి కుట్రలతో కొండెపి సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకున్నారని తెలిపారు. కూటమికి నిజంగా ప్రజాబలం ఉంటే నిజాయితీగా ఎన్నికలను జరిపించాలని డిమాండ్ చేశారు.అన్ని సాక్ష్యాలను ఎన్నికల కమిషనర్ కు అందించామని తెలిపారు. ఎస్ఈసీని కలిసిన వారిలో మాజీ మంత్రులు ఆదిమూలం సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొండెపి సర్పంచ్ అభ్యర్ధి మేరి ఉన్నారు.
Andhra Pradesh
YSRCP
Kondepi Sarpanch Election
TDP Allegations
Election Commissioner
Adimulapu Suresh
Panchayat Elections
కొండెపి సర్పంచ్ ఎన్నికలు
నామినేషన్ వివాదం
Scroll for the next article