Politics13th Jul 11:44 AMSunil Byrisetty1 min read

గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ ప్రెస్ మీట్!

గుడివాడలో శనివారం హైటెన్షన్ నెలకొంది. కూటమి శ్రేణులు దాడి చేసారంటూ మీడియాతో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు తదితరులు మాట్లాడారు. కృష్ణా జిల్ల

గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ ప్రెస్ మీట్!
గుడివాడలో శనివారం హైటెన్షన్ నెలకొంది. కూటమి శ్రేణులు దాడి చేసారంటూ మీడియాతో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు తదితరులు మాట్లాడారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై దాడి చేయడం సరికాదని ఖండించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, అరాచకాలు సృష్టించి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. రాజకీయాలకతీతంగా స్నేహభావంతో ఉంటూ సౌమ్యురాలైన హారికను తీవ్ర పదజాలంతో అవమానించడం నీచమైన చర్య అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై భౌతిక దాడులకు పాల్పడటం సరికాదన్నారు. దాడులకు దిగిన మూకలపై,పోలీసులు కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh news
Gudivada
Ap politics
Ysrcp leaders press meet
TDP manifesto
High tension
YCP president Gorla Srinu
వైయస్ఆర్ సీపీ నాయకులు ప్రెస్ మీట్
Scroll for the next article