Politics1st Jun 12:53 PMSunil Byrisetty1 min read

జూన్ 4 న వెన్నుపోటు దినం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, విజయవాడల పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అనేక అబద్ధపు

జూన్ 4 న వెన్నుపోటు దినం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, విజయవాడల పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అనేక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటు గుర్తు చేస్తూ జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని చెప్పారు. 175 నియోజక వర్గాలలో వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలబడతామన్నారు. జూన్ 4వ తేదీన జరగబోయే వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అనేక హామీలు అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ హామీ అమలు చేయలేకపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు.
Andhra Pradesh news
YSRCP
vellampalli srinivas rao
Vennupotu Dinam Program Poster release
వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరించారు
జూన్ 4 న వెన్నుపోటు దినం
Scroll for the next article