Politics6th Sep 01:33 PMSunil Byrisetty1 min read
ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరు
ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్‌ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు అనేక ఇ
ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్‌ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. జగన్ హయాంలో రైతు భరోసా, పంట ఇన్సూరెన్స్‌తో అండగా నిలిచామని గుర్తు చేశారు. ప్రస్తుతం మద్దతు ధరలు లేక, యూరియా అందక రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని అన్నారు. చంద్రబాబు గతంలో రైతులను మోసం చేశారని, ఇప్పుడు కూడా అదే కొనసాగుతున్నదని ఆరోపించారు. ఈ నెల 9న అన్ని ఆర్డీవో కార్యాలయంలో రైతుల వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.