Politics3rd Sep 12:56 PMSunil Byrisetty1 min read
వైసీపీ నేత వార్నింగ్.. గొడ్డలితో వస్తాం
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనా వైసీపీ నేతలు తగ్గడం లేదు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఓడిపోయాం రేపు కచ్చితంగా గెలుస్తామన
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనా వైసీపీ నేతలు తగ్గడం లేదు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఓడిపోయాం రేపు కచ్చితంగా గెలుస్తామని అన్నారు. గెలిచిన తరవాత చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఎప్పుడూ మంచితనంతో ఉంటే పనికిరాదని వాళ్లే నేర్పించారని అన్నారు. గతంలో కర్ర పట్టుకుని వచ్చేవాళ్లు రేపు గొడ్డలితో వస్తారని అన్నారు. తెగించే వరకు తీసుకెళ్లారని, తెగించిన తరవాత తట్టుకునే స్థాయి టీడీపీ నేతలకు లేదని వివాదాస్పద వ్యాఖ్యలు అన్నారు.