Politics3rd Oct 04:38 PMSunil Byrisetty1 min read

ఎన్నికలకు లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు నామినేషన్‌ నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు అన్ని దశల్లో న్యాయపరమైన అండ అందించేందుకు పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్

ఎన్నికలకు లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు నామినేషన్‌ నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు అన్ని దశల్లో న్యాయపరమైన అండ అందించేందుకు పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు లీగల్ సెల్ గట్టిగా అండగా నిలిచిందని అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా సహకరించాలని సూచించారు. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పోలింగ్ సందర్భంగా ఎదురయ్యే సమస్యలపై వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలమై సజావుగా స్ధానిక ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమన్న కారణంతో పోలీసులను, అధికారులను ఉపయోగించి అక్రమ కేసులు, వేధింపుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసినా ధీటుగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సన్నద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని లీగల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట న్యాయవాదులను అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా సెంట్రల్ ఆఫీస్‌లో లీగల్ వార్‌రూమ్ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
Scroll for the next article