Politics28th Oct 12:50 PMSunil Byrisetty1 min read

స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ దూరం?

ఏపీలో అధికారం కోల్పోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండనున్నట్లు

స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ దూరం?
ఏపీలో అధికారం కోల్పోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన విషయాన్ని కొంతమంది సీనియర్ నేతలు జగన్ మోహన్ రెడ్డికి గుర్తు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఖర్చుపెట్టినా ఉపయోగం ఉండదని వైసీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh Politics
YSR Congress Party
Jagan Mohan Reddy
Local Body Elections
TDP
Chandrababu Naidu
రాజకీయ వ్యూహం
వైసీపీ నిర్ణయం
ఏపీ ఎన్నికలు
Scroll for the next article