Politics14th Aug 05:07 PMSunil Byrisetty1 min read

పులివెందుల‌ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని జగన్ కోల్పోయాడు

పులివెందుల‌ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహన్ రెడ్డి కోల్పోయాడ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలోని బాప‌ట్ల

పులివెందుల‌ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని జగన్ కోల్పోయాడు
పులివెందుల‌ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహన్ రెడ్డి కోల్పోయాడ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలోని బాప‌ట్ల జిల్లా, ముప్ప‌వ‌రం క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి గొట్టిపాటి ల‌బ్ధిదారుల‌కు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు కూడా జ‌గ‌న్ ను న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. 2019 నుంచి 2024 వ‌ర‌కు తాము 23 మంది ఎమ్మెల్యేల‌మే ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల త‌రుపున ధైర్యంగా అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాడామ‌న్నారు. వైసీపీ చేసిన త‌ప్పుల్ని ప్ర‌జాక్షేత్రంలో ఎండ‌గ‌ట్టామ‌ని తెలిపారు. ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. విమ‌ర్శ‌ల పేరుతో విధ్వంసం చేస్తూ రెచ్చ‌గొడుతూ, అమాయ‌క ప్ర‌జ‌ల్నితొక్కుకుంటూ పోవ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అల‌వాటుగా మారింద‌ని మంత్రి గొట్టిపాటి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
Andhra Pradesh politics
Pulivendula
Jagan Mohan Reddy
Minister Gottipati Ravi Kumar
YSRCP
ys jagan
opposition
political criticism
ZPTC elections
జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
పులివెందుల నియోజకవర్గం
Scroll for the next article