Politics15th Oct 05:45 PMSunil Byrisetty1 min read

వరుదు కల్యాణికి వైసీపీ ఆఫర్?

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. మేయర్ పీఠం జనరల్ మహిళ కు కేటాయించారు. ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖపట్నంలో గత సార్వత్

వరుదు కల్యాణికి వైసీపీ ఆఫర్?
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. మేయర్ పీఠం జనరల్ మహిళ కు కేటాయించారు. ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖపట్నంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ ఓటమిని చవిచూడటంతో ఆ పార్టీ ముఖ్య నేతల్లో స్థానిక సంస్థల ఎన్నికలంటేనే వణుకు పుడుతోంది. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో నగరంలోని దాదాపు 98 వార్డుల పరిధిలో లక్షలాది మంది ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, కూటమి ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడటం పెను సవాలుగా మారింది. దీనికితోడు ప్రచార నిర్వహణ, వార్డుల వారీగా ఖర్చులకు కనీసం పదుల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. పార్టీ హైకమాండ్ నుంచి పైసా సహాయం అందే అవకాశం లేకపోవడంతో.. నగరంలోని సీనియర్ నేతలు, మాజీ మంత్రులు తమ కుటుంబాల్లోని మహిళలను బరిలోకి దించేందుకు సిద్ధపడటం లేదు. ఈ క్రమంలోనే పార్టీ విధేయురాలైన వరుదు కళ్యాణిపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఆమె పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.
Scroll for the next article