Politics16th May 03:45 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వ అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి

కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి సృష్టిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఆర్‌టీఐ విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్

ప్రభుత్వ అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి
కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి సృష్టిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఆర్‌టీఐ విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్ధి, ఉపాధ్యాయుల రేషియోలో అశాస్త్రీయ విధానం కారణంగా దాదాపు 10వేల మంది స్కూల్ అసిస్టెంట్‌లను సర్‌ప్లస్‌గా చూపే పరిస్థితిని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మిగులు టీచర్లను చూపుతూ, మరోవైపు డీఎస్సీలో కొత్త టీచర్ పోస్ట్‌లను ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. డీఎస్సీలో కూడా పోస్ట్‌లను తగ్గించేందుకే ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైయస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణలను కక్షతోనే నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.
Ysrcp
MLC Kalpalatha Reddy
Chandra babu
AP Education
ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి
కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి
Scroll for the next article