Politics13th Oct 05:34 PMSunil Byrisetty1 min read

ఇండియా కూటమివైపు వైసీపీ అడుగులు!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇండి కూటమివైపు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎన్డీయే

ఇండియా కూటమివైపు వైసీపీ అడుగులు!
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇండి కూటమివైపు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎన్డీయే అడగకపోయినా అన్ని బిల్లులకు మద్దతునిస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కేంద్రంలోని ఎన్డీయేకు మద్దతుగానే వ్యవహరిస్తోంది. అయినప్పటికీ వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులను వేగంగా విచారించాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంపై జగన్ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై దూకుడుగా వ్యవహరిస్తుండటంతో జాతీయ స్థాయిలో ఇండియా కూటమి మద్దతు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం, ఎస్ఐఆర్ పై నేరుగా పోరు ప్రారంభించినట్లు చెబుతున్నారు.
Scroll for the next article