Politics5th Oct 12:39 PMSunil Byrisetty1 min read

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వైసీపీ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో వైసీపీ సవాల్ చేసింది. వార్డుల విభజన చేసుకోవచ్చని, స్థానిక సంస్థల ఎన

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వైసీపీ
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో వైసీపీ సవాల్ చేసింది. వార్డుల విభజన చేసుకోవచ్చని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఈ నెల 1న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 'సర్ (S.I.R) ప్రక్రియ' పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రతివాదిగా వైసీపీ చేర్చింది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Scroll for the next article